అల్లు అరవింద్ చేసిన పనిని ఇప్పటికీ మర్చిపోలేక పోతున్న ఐకాన్ స్టార్..! పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-12-25 06:34:38.0  )
అల్లు అరవింద్ చేసిన పనిని ఇప్పటికీ మర్చిపోలేక పోతున్న ఐకాన్ స్టార్..! పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇండియా వైడ్‌గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో ఫుల్ బిజీగా మారిపోయారు. అయినా కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. తాజాగా, అల్లు అర్జున్ చేసిన ఓ సినిమాకి ఓ ప్రముఖ నిర్మాత పారితోషకం ఇవ్వలేదట. ఈ విషయం తెలియజేస్తూ అల్లు అర్జున్ స్వయంగా తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘నా మొదటి మూవీ విజేత. నా ప్రొడ్యూసర్ మా నాన్న. ఇన్నాళ్ల తర్వాత నేను గ్రహించింది ఏంటంటే.. ఈ చిత్రానికి నాకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు” అంటూ ఫన్సీగా రాసుకొచ్చారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే చిరంజీవి హీరోగా 1985లో తెరకెక్కిన ‘విజేత’ సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ మూవీలో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సీన్ లో కనిపిస్తారు. చిరంజీవి సిస్టర్ కొడుకుగా అల్లు అర్జున్ కనిపిస్తారు. బన్నీ నటించిన మొదటి మూవీ అదే. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు.



Advertisement

Next Story

Most Viewed