Shraddha Das: మోడ్రన్ డ్రెస్ వేసుకొని కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్

by Prasanna |
Shraddha Das: మోడ్రన్ డ్రెస్ వేసుకొని కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రతీ హీరోయిన్ కి సక్సెస్ వెంటనే రాదు కొంతమంది ఇక్కడ త్వరగా సెటిల్ అవుతారు మరి కొందరు చాలా కష్ట పడితే తప్ప ఇక్కడ సెటిల్ కాలేరు. ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్ శ్రద్ధాదాస్ కథ కూడా అంతే. 2008 లో పరిచయమైన ఈ ముద్దుగుమ్మకి ఇంత వరకు సరయిన గుర్తింపు రాలేదు. హీరోయిన్ గా కొనసాగుతుందని అనుకున్నారు కానీ, సహాయ నటీగా చేస్తుంది. అల్లు అర్జున్, వెంకటేష్, ప్రభాస్ సినిమాల్లో సెకెండ్ లీడ్ గా చేసింది అయినా ఈమెకి మాత్రం ఎలాంటి క్రేజ్ రాలేదు.

ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రమే కాకుండా క‌న్న‌డ‌, మ‌ల‌యాళ మూవీస్ లో న‌టించింది. ఇటీవల పారిజాత పర్వం అనే మూవీలో మెరిసింది. సినిమాలతో సంబందం లేకుండా సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఈమెకు సమయం కుదిరినప్పుడల్లా ఫోటో షూట్స్ చేసి పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా, ఈ అందాల తార షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

శ్రద్ధాదాస్ కట్టెల పొయ్యి పై రొట్టెలు చేస్తూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి. దీనికి సంబందించిన ఫోటోస్ ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. వీటిపై స్పందించిన ఫ్యాన్స్, నెటిజన్లు పొయ్యి దగ్గర ఫోటో ఫోజులకు ఎందుకు అంతలా కష్టపడటం అయినా మోడ్రన్ డ్రెస్ వేసుకొని అక్కడ ఎందుకు కూర్చొన్నారంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story