సరోగసి వివాదానికి పుల్‌స్టాప్ పెట్టిన విఘ్నేష్ శివన్

by sudharani |
సరోగసి వివాదానికి పుల్‌స్టాప్ పెట్టిన విఘ్నేష్ శివన్
X

దిశ, సినిమా : లేడీ సూపర్ స్టార్ నయన్, విఘ్నేష్ శివన్ జూన్ 9న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక్కటయ్యారు. వీరికి వివాహమై నాలుగు నెలలు గడిచిపోగా.. తాజాగా తమకు ఇద్దరు మగ పిల్లలు జన్మించారంటూ వారి పాదాల ఫొటోస్ షేర్ చేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు విఘ్నేష్. ఇందుకోసం నయన్ దంపతులు సరోగసి పద్ధతిని ఆశ్రయించినట్లు తెలుస్తుండగా.. ఈ విషయం బయటకు రావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. 'మన దేశంలో సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనివ్వడం నిషేధమని, ఈ ఏడాది జనవరి నుంచే ఇందుకు సంబంధించిన చట్టం అమలులో ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా చాలా మంది, చాలా రకరకాలుగా ట్రోల్ చేస్తుండటంతో ఓపిక నశించిన విఘ్నేష్.. 'అన్ని విషయాలు మీకు సరైన సమయంలో తెలుస్తాయి. అప్పటి వరకు ఓపిక పట్టండి. ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి' అనే కోట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇప్పుడీ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story