- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: స్పీచ్ మధ్యలో ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయి.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే!
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కి యూత్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ కూడా ఉన్నారు అని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. ఇక టాలీవుడ్‌లోనే అత్యంత క్రేజీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్‌కు మాత్రమే ఉన్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ ఫాలోయింగ్ విషయంలో బాయ్స్ అభిమానులే ఎక్కువ అని అనుకుంటాము. కానీ, అమ్మాయిల్లోనూ ఆ పిచ్చి ఉందని చాటి చెప్పారు కొందరు గర్ల్స్. తాను కూడా అబ్బాయిల్లా ప్రేమిస్తామని, అభిమానిస్తామని తెలియజేశారు గర్స్. ఈ క్రమంలో ఓ అమ్మాయి చేసిన పని ఇప్పుడు నెట్టింట ఇంట్రెస్టింగ్‌గా మారింది.
గతంలో పవన్ కళ్యాణ్ ఓ ఈవెంట్‌లో సినిమాల్లో, రాజకీయాల్లో, తన లైఫ్‌లో మనీ మ్యాటర్ గురించి ఆయన సీరియస్‌గా స్పీచ్ ఇస్తున్నారు. అందరూ కూడా అదే మూడ్‌లో ఉన్నారు. అందులో భాగంగా డబ్బులు కలెక్ట్ చేసుకోండి, డబ్బులు కలెక్ట్ చేసుకోండి అని పవన్ చెబుతుండగానే ఇంతలో వెనకాల నుంచి ఓ అమ్మాయి ఐ లవ్ యూ సర్ అని ప్రపోజ్ చేసింది. దెబ్బకి స్పీచ్ ఆపేసి పవన్ ఆమె వంక చూశాడు. ఆమెని చూసిన పవన్.. నవ్వుతూ అమ్మాయిలు ఇలా రౌడీలా తయారైపోతే ఎలా చెప్పండి.. అబ్బాయిలు చేస్తే ఈవ్ టీజింగ్ అంటాం.. మరి అమ్మాయిలు చేస్తే ఆడమ్ టీజింగ్ అనాలా మనం అంటూ క్యూట్‌గా స్మైల్ ఇచ్చారు. అంతే దెబ్బకి ఆ ప్రాంగణం మొత్తం అరుపులతో దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు వంటి సినిమాల్లో నటిస్తున్నారు.