ఒకే తేదీన అక్కినేని హీరోల చిత్రాలు విడుదల.. హిట్ కొడతారో లేదో!

by Hajipasha |   ( Updated:2022-12-27 10:05:17.0  )
ఒకే తేదీన అక్కినేని హీరోల చిత్రాలు విడుదల.. హిట్ కొడతారో లేదో!
X

దిశ, సినిమా: ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీకి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. అలాగే నాగచైతన్య నటించిన 'థ్యాంక్యూ', 'లాల్ సింగ్ చద్దా' సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. మరోవైపు అఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కేవలం పోస్టర్స్ మాత్రమే విడుదలయ్యాయి. తాజాగా చైతన్య, అఖిల్‌కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. అదేమిటంటే.. నాగచైతన్య హీరోగా నటిస్తున్న మూవీ 'కస్టడీ' అలాగే అఖిల్ హీరోగా నటిస్తున్న 'ఏజెంట్'.. ఈ రెండు చిత్రాలను జనవరి 1న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. వార్త మాత్రం వైరల్ అవుతోంది.

Advertisement

Next Story