Hot News :బట్టలు విప్పి నగ్నంగా రా.. హీరోకు మహిళా దర్శకురాలి వేధింపులు

by sudharani |   ( Updated:2022-10-23 12:23:18.0  )
Hot News :బట్టలు విప్పి నగ్నంగా రా.. హీరోకు మహిళా దర్శకురాలి వేధింపులు
X

దిశ, సినిమా: మనకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో నటీమణులు మాత్రమే మోసపోతుంటారు. కానీ ఇప్పుడు రీసెంట్‌గా సాధారణ నటుడికి కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది. అది కూడా ఓ మహిళ దర్శకురాలి చేతిలో కావడం విశేషం. ఈ సంఘటన కేరళ‌లో చోటుచేసుకుంది. కేరళకు చెందిన టీవీ సీరియల్స్‌లో నటించే యువ నటుడు.. సినిమాల్లో కూడా రాణించాలనే లక్ష్యంతో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఎట్టకేలకు ఒక సినిమా చాన్స్ రావడంతో సంతోషంతో అగ్రిమెంట్ చదవకుండా ఆనందంలో సంతకం చేసాడు.

ఇక షూటింగ్‌లో పాల్గొనేందుకు సెట్స్‌కు వెళ్లిన తర్వాత అసలు విషయం బయట పడింది. అక్కడ ఉన్న మహిళా దర్శకురాలు అతడిని బట్టలు విప్పి నగ్నంగా నటించాలని అడిగింది. ఆ యువ నటుడకి అప్పుడు విషయం అర్థమయింది. తాను నటించబోయేది ఓ బూతు సినిమా అని.. దీంతో కోపం వచ్చి నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేయనని తేల్చి చెప్పాడు. అయితే ఆ దర్శకురాలు అంతటితో ఊరుకోలేదు. ' నువ్వు అగ్రిమెంట్ పై సంతకం చేశావు, మూవీ నుంచి తప్పుకుంటే రూ.5 లక్షల జరిమానా చెల్లించాలి' అని బెదిరించింది. దీంతో చేసేదీమీ లేక ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మహిళా దర్శకురాలిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : నగ్నంగా దివాళీ సెలబ్రేషన్స్.. ఆమె వీడియో చూస్తే మతిపోవాల్సిందే

Advertisement

Next Story