Hema Malini: ఆ దర్శకుడు నన్ను చీర విప్పమన్నాడు..

by Prasanna |   ( Updated:2023-07-10 08:00:57.0  )
Hema Malini: ఆ దర్శకుడు నన్ను చీర విప్పమన్నాడు..
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినికి 75ఏళ్ల వయసులో కూడా అందంతో పాటు ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇకపోతే తాజాగా హేమమాలిని చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘గతంలో ఓ డైరెక్టర్ నన్ను చీరకు ఉన్న పిన్ తీసేయాలని కోరాడు. అప్పుడు నేను నిజంగా షాక్‌కు గురయ్యాను. ఏదో ఒక బోల్డ్ సన్నివేశాన్ని చిత్రీకరించాలనుకుంటున్నాడు అనుకున్నా. నేను ఎప్పుడూ నా చీరపై పిన్‌ పెట్టుకుంటా. కానీ ఆ టైంలో నన్ను చీరకు ఉన్న పిన్ తీసేయమని ఆ దర్శకుడు చెప్పారు. నాకు నచ్చలేదు. పిన్ తీస్తే చీర జారిపోతుందని చెప్పాను. నాకు కావాల్సింది కూడా అదే అన్నాడు. ఇక మూవీ ఒప్పుకున్నాక తప్పలేదు. అందుకే అతను చెప్పిన విధంగా చేశాను. చాలా ఏడుపొచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ.

Also Read..

అక్కడ పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేను.. రకుల్

భర్త రవీంద్రకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మహాలక్ష్మీ

Advertisement

Next Story