Devara Movie: దేవర మూవీ హైప్‌ కోసం దర్శక, నిర్మాతల భారీ ప్లాన్‌..!

by Prasanna |   ( Updated:2024-09-15 15:12:58.0  )
Devara Movie: దేవర మూవీ హైప్‌ కోసం దర్శక, నిర్మాతల భారీ ప్లాన్‌..!
X

దిశ, వెబ్ డెస్క్ : శివ కొరటాల డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ దేవర. ప్రస్తుతం ఈ మూవీలో పని చేసిన నటీ నటులు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. సినిమా విడుదల అయ్యే ముందు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

నాలుగు రోజుల క్రిత్రం రిలీజ్ అయినా ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ రావడంతో ప్రీ-రిలీజ్‌ ఈవెంటును కుడా అలాగే చేయాలనీ మూవీ మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా ఎవరు వస్తారా అని చాలా మంది వేచి చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మంచి ఫేమ్ ఉన్న హీరోలను గెస్ట్ లను ఇన్వైట్ చేయాలనీ మూవీ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఈవెంట్‌కు వచ్చే అతిధులు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న దేవర మూవీ ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రీ-రిలీజ్‌ ఈవెంటును సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ముందు ఏపీలో నిర్వహించాలని చూశారు కానీ, విజయవాడలో వరదల కారణంగా అక్కడ క్యాన్సల్ చేసి హైదరాబాద్‌లో చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ను, ప్రిన్స్‌ మహేశ్‌ బాబుని తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Read More..

2024 సైమా అవార్డుల విజేతల లిస్ట్.. మరోసారి రికార్డు క్రియేట్ చేసిన నాని

Advertisement

Next Story

Most Viewed