- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీ సినిమాలో ఏలాంటి పాత్ర ఇచ్చిన నాకు ఓకే : తాప్సీ
దిశ, సినిమా: టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న చాలా మంది హీరోయిన్ లు అవకాశాలు తగ్గడంతో.. పక్క ఇండస్ట్రీల దారి పడుతున్నారు. ఇందులో తాప్సీ ఒకరు. తెలుగులో అనతి కాలంలోనే హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇక రీసెంట్ గా షారుక్ ఖాన్ కి జోడిగా ‘డుంకి’ మూవీలో నటించిన ఈ చిన్నది మరింత ఫేమ్ సంపాదించుకుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది..
నటి మాట్లాడుతూ ‘ నేను దర్శకుడు రాజ్‌కుమార్ కి మంచి అభిమానిని. ఆయన సినిమాలు పిచ్చిగా చూసేదాని. ఇక షారుక్ , రాజ్‌కుమార్ కాంబోలో మూవీ వస్తుంది అని తెలిసి ఎప్పుడు ఎప్పుడు చూడాలి అని అనుకున్నా. కానీ ఈ సినిమాలో నేను కూడా నటించబోతున్నట్లు వార్తలు రావడంతో .. పుకార్లు అని లైట్ తీసుకున్న. కానీ వినడానికి ఆనందంగా అనిపించింది. ఓ రోజు రాజ్‌కుమార్ నాకు కాల్ చేశాడు ‘నువ్వు కూడా షారుఖ్ మూవీలో ఉన్నావు వార్తలు విని ఉంటావు గా.. చెబుదామని కాల్ చేసా. కథ విని ఓకే చేయండి’ అని అన్నారు. నాకు ఒక నిమిషం మాటలు రాలేదు. మీ మూవీలో చెట్టుగా నిలబడి ఉండే పాత్ర ఇచ్చిన నేను చేస్తాను.. కథ వినాల్సిన అవసరం లేదు నాకు ఓకే అనేసా. షారుక్ సినిమాలు చూస్తూ పెరిగిన దానీ ఆయన పక్కన నటించడం అంటే కంగారుగా అనిపించిది. కానీ ఆయన చాలా కూల్ గా ఉంటారు. ప్రతి విషయం షారుక్ తో షేర్ చేసుకునేదాని. అయితే ఈ మూవీ లో దాబాలో ఫారుఖ్‌తో వాదనకు దిగే సీన్ ఉంటుంది. అది చేసెటప్పుడు ఆయన చేసిన రొమాంటిక్ సినిమాలన్నీ నా కండ్లముందు కదలాడాయి. యాక్టింగ్ అయిన షారుక్ తో ఎలా వాదించేది అనిపించింది. ఇక రాజ్‌కుమార్‌తో పనిచేయడం గొప్ప అనుభూతి.. తనకు ఎలాంటి అవుట్‌కమ్ రావాలో పక్కాగా తెలిసిన గొప్ప దర్శకుడు ఆయన’ అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.
- Tags
- taapsee pannu