‘పీఎస్ 2’ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు: మ‌ణిర‌త్నం

by sudharani |   ( Updated:2023-04-24 12:31:41.0  )
‘పీఎస్ 2’ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు: మ‌ణిర‌త్నం
X

దిశ, సినిమా : ఏప్రిల్ 28న విడుదల కాబోతున్న ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన దిల్ రాజు మాట్లాడుతూ.. ‘పీఎస్1’ను తెలుగు రాష్ట్రాల్లో మా బ్యాన‌ర్‌లో విడుద‌ల చేసి గ్రేట్ స‌క్సెస్ అందుకున్నాం. ‘పీఎస్ 2’ కూడా రిలీజ్ చేస్తున్నాం. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌. రెహ‌మాన్‌ సంగీతం అందించిన ఈ మూవీ మ్యూజిక‌ల్‌గానూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది’ అన్నారు.

అలాగే చోళుల చరిత్రను తెలియ‌జేసే సినిమాను అత్యద్భుతమైన విజువ‌ల్స్‌తో లార్జర్ దేన్ లైఫ్‌గా తెరకెక్కించామన్న మణిరత్నం.. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారన్నాడు. ఇక జయం రవి, ఐశ్వర్యా రాయ్, ఐశ్వర్యా ల‌క్ష్మి, శోభితా దూళిపాళ, సుహాసిని, త్రిష, కార్తీ, విక్రమ్ మాట్లాడుతూ.. తాము చాలా క‌ష్టప‌డి చేసిన సినిమాలోని ప్రతి క్షణాన్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారని, మూవీని పెద్ద సక్సెస్ చేయాల‌ని కోరారు. మూవీని లైకా ప్రొడ‌క్షన్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్కర‌న్‌, మ‌ణిర‌త్నం భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

Also Read..

ఓవర్సీస్‌లో విడుదలకు సోలోగానే 'ఆదిపురుష్'

Advertisement

Next Story