Shruti Haasan ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు షాకైన ప్రేక్షకులు (వీడియో)

by sudharani |   ( Updated:2022-09-11 12:56:12.0  )
Shruti Haasan ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు షాకైన ప్రేక్షకులు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శృతి హాసన్. తన నటనతో, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విజయం సాధించిన అభిమాన హీరో, హీరోయిన్‌ల సినిమాలు మరల తెరపైకి తీసుకొచ్చి అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే తెలుగులో పవన్ కల్యాణ్ జల్సా, మహేశ్ బాబు పోకిరి సినిమాలు రీరిలీజ్ కాగా ప్రేక్షకులలో మంచి ఆదారణ కూడా లభించింది.

దీంతో తమిళనాడులో కూడా ఈ ట్రెండ్ ఫాలోఅవుతున్నారు. ఈ క్రమంలోనే ధనుష్, శృతిహాసన్ కాంబినేషన్‌లో 10 ఏళ్ల క్రితం రిలీజై ప్రేక్షకులను మెస్మరైజ్ సినిమా 'త్రీ'. ఇప్పుడు ఈ మూవీని రీరిలీజ్ చేశారు. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీరిలీజ్ చేసిన ఈ మూవీకి ఇప్పుడు కూడా అదే క్రేజ్ దక్కింది. అయితే, ప్రేక్షకులు సినిమాలో లీనమై చూస్తున్న సమయంలో శృతి హాసన్ సడెన్‌గా థియేటర్‌లోకి ఎంట్రీ ఇచ్చి అవాక్కయ్యోల చేసింది. అంతేకాకుండా ఆ సినిమాలో రొమాంటిక్ సాంగ్ కన్నులదా పాటపాడి సర్‌ప్రైజ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో శృతిహాసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి : మరో రికార్డు సృష్టించిన Kamal Haasan 'Vikram..

Advertisement

Next Story