- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘జైలర్’ సీక్వెల్ నుంచి అప్‌డేట్.. తన పాత్ర గురించి లీక్ చేసిన నటి
దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ లాస్ట్ ఇయర్ ‘జైలర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వరుస ప్లాప్స్ తర్వాత రజినీ ఈ చిత్రంతో కమ్ బ్యాక్ ఇచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. తమిళనాడులో దాదాపు అప్పటివరకు ఉన్న అన్ని కలెక్షన్ రికార్డులను జైలర్ బద్దలు కొట్టింది. అయితే.. ఈ సినిమాకు ముందు ఎలాంటి సీక్వెల్‌ను అనౌన్స్ చేయలేదు కానీ.. ఆఫ్టర్ సక్సెస్ ‘జైలర్’ పార్ట్ 2 పై అప్‌డేట్ ఇచ్చాడు నెల్సన్. ఇక ఇప్పటి వరకు మరొక సినిమాకి కమిట్మెంట్ ఇవ్వకుండా తన పూర్తి ఫోకస్ సీక్వెల్‌పై పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో అప్‌డేట్ వచ్చింది.
‘జైలర్’ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కోడలిగా నటించిన మిర్నా గుర్తుండే ఉంటుంది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. జైలర్ 2కి సంబంధించిన అప్‌డేట్‌ను లీక్ చేసింది. డైరెక్టర్ నెల్సన్ ‘జైలర్ 2’ స్క్రిప్ట్ పనిలో ఉన్నాడట. ఈసారీ భారీ బడ్జెట్‌తో ఇంకా పెద్దగా ప్లాన్ చేస్తు్న్నారట. తనతో ఈ విషయం స్వయంగా నెల్సన్ చెప్పినట్టు మిర్నా తెలిపింది. అయితే జైలర్ సీక్వెల్‌లో తన పాత్ర గురించి కూడా మాట్లాడుతూ.. ‘సీక్వెల్‌లో నేను ఉన్నానో లేదో తెలియదు. నా పాత్రపు పెంచాలి అనుకుంటే అందులోనేను ఉంటాను. లేకపోతే లేదు’ అంటూ చెప్పుకొచ్చారు.
- Tags
- Mirna Menon