‘పుష్ప-2’ సినిమాలో ఆ హీరోకి భార్యగా నటిస్తున్న ప్రియమణి.. క్లారిటీ ఇచ్చిన నటి

by Nagaya |   ( Updated:2023-09-11 04:29:44.0  )
‘పుష్ప-2’ సినిమాలో ఆ హీరోకి భార్యగా నటిస్తున్న ప్రియమణి.. క్లారిటీ ఇచ్చిన నటి
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియమణి ఇటీవల వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది నాగచైతన్య నటించిన కస్టడీ మూవీలో ప్రియమణి నటించింది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప-2 మూవీలో ప్రియమణి నటిస్తున్నట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారని.. ఆయనకు భార్యగా ప్రియమణి నటిస్తుందని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా, ఇలాంటి వార్తలపై ఈ అమ్మడు స్పందించింది. ‘‘ నాపై వస్తున్న వార్తలను చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. పుష్ప-2 లో నటించట్లేదు. నాపై వస్తున్న పుకార్లు చూసి వెంటనే నా మేనేజర్‌కు ఫోన్ చేశాను. అయితే అందులో నటించే అవకాశం వస్తే అల్లు అర్జున్‌తో నటిస్తాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియమణి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed