అందుకే ట్విట్టర్, ఫేస్‌బుక్ డిలీట్ చేశా.. ఇన్‌స్టాగ్రామ్‌ని మాత్రం అస్సలు వదులుకోలేను: రేణు దేశాయ్

by Kavitha |
అందుకే ట్విట్టర్, ఫేస్‌బుక్ డిలీట్ చేశా.. ఇన్‌స్టాగ్రామ్‌ని మాత్రం అస్సలు వదులుకోలేను: రేణు దేశాయ్
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జానీ’ మూవీలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక పవన్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత తన పని తాను చేసుకుంటున్న రేణు దేశాయ్ ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్‌కి గట్టిగానే సమాధానాలు ఇస్తుంది.

ఇదిలా ఉంటే సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియా అనేది చాలా ముఖ్యం. వారి సినిమా అప్డేట్స్ గురించి ఫాలోవర్స్‌తో షేర్ చేయడం, ప్రమోషన్స్ చేయడం అనేది చాలా వరకు సినీ సెలబ్రిటీల జీవితాల్లో భాగమయిపోయారు. సినీ స్టార్లలో సోషల్ మీడియా ఉపయోగించని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే రేణు దేశాయ్‌కు కూడా ట్విటర్, ఫేస్బుక్ లాంటి వాటిలో అకౌంట్స్ ఏమీ లేవు. కేవలం ఇన్స్టాగ్రామ్ లోనే ఆమె ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. తన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకోవాలని అనిపించేవి పోస్ట్ చేస్తుంటారు. తాజాగా తనకు ఇన్స్టాగ్రామ్ ఎందుకు ముఖ్యమో చెప్తూ ఒక పోస్ట్ ని షేర్ చేశారు రేణు దేశాయ్.

‘‘నాపై చూపిస్తున్న ద్వేషాన్ని, చేస్తున్న ట్రోల్స్‌ని చూడలేక నేను ట్విటర్, ఫేస్బుక్ డిలీట్ చేశాను. కానీ మీలాంటి చాలామంది గొప్పవాళ్ళు చెప్తున్నట్టుగా నేను నా ఇన్స్టాగ్రామ్ను డిలీట్ చేయలేను. ఎందుకంటే యాక్సిడెంట్ కేసులకు సహకరించడానికి, పిల్లలకు ఆహారం, మెడిసిన్స్ అందించడానికి, పిల్లులకు, కుక్కలకు మెడికల్ సౌకర్యాలు అందించడానికి, వాటి దత్తత వివరాలకు మాత్రమే 90 శాతం నేను ఇన్స్టాగ్రామ్ను ఉపయోగిస్తాను. గత 10 రోజుల్లో నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఉపయోగించే 4 పిల్లులను, ఎన్నో కుక్కలను కాపాడి వాటికి కొత్త ఇంటిని అందించగలిగాను’’ అని చెప్పుకొచ్చారు రేణు దేశాయ్. అదేవిధంగా ‘‘నేను నా ఇన్స్టాగ్రామ్ ఈ చారిటీకి సంబంధించిన రీల్స్ పెద్దగా షేర్ చేయను. ఇదంతా నా ఇన్ బాక్స్‌లోనే జరుగుతుంది. కాబట్టి నాకు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావాలి. నేను డిలీట్ చేయలేను’’ అని క్లారిటీ ఇచ్చారు రేణు దేశాయ్.


Advertisement

Next Story