నేను ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. నటి సంచలన కామెంట్స్

by sudharani |
నేను ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. నటి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: ఈ రోజుల్లో చాలా మంది వివాహ జీవితాన్ని కంటే.. సింగిల్ లైఫ్‌నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సెలబ్రెటీలు కూడా ఇదే ఫాలో అవుతూ సింగిల్‌గా ఉండిపోతున్నారు. వారిలో పాకిస్థానీ నటి యుమ్నా జైదీ ఒకరు. ‘మేరీ దులారీ, దిల్ ముహల్లే కీ హవేలీ, రిస్తే కుచ్ అధూరే సే, దిల్ నా ఉమీద్ తో నహీ, ప్యార్ కే సద్ఖే, పరిజాద్, బఖ్తవర్’ వంటి సీరియల్స్‌లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ‘తేరే బిన్’ సిరీయల్‌తో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రజెంట్ సహ నటుడు వహజ్ అలీతో అమెరికాలోని డల్లాస్‌లో ఉంటున్న ఈమె.. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది.

ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి ప్రశ్నించారు నెటిజన్లు. ఈ మేరకు నటి యుమ్నా జైదీ స్పందిస్తూ.. ‘నేను చాలా మొండిదాన్ని. అందుకే సింగిల్‌గా ఉన్నాను. అలా ఎందుకనేది నాకే తెలియదు. అంతే కాకుండా నేను సింగిల్‌గా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం యుమ్నా జైదీ గ్రీన్ ఎంటర్‌టైన్మెంట్స్ డ్రామా సీరియల్‌లో నటిస్తోంది.

Read more...

Chinmai Sripaada: చిన్నపిల్లవాడితో అనసూయ లిప్ కిస్.. సిగ్గు చేటు అంటూ చిన్మయి సెన్సేషనల్ పోస్ట్



Next Story

Most Viewed