- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదే నా చివరి సినిమా: మంత్రి ఉదయనిధి స్టాలిన్ షాకింగ్ డెసిషన్
దిశ, వెబ్‌డెస్క్: తమిళ యాక్టర్, నిర్మాత, డీఎంకే పార్టీ యువ నేత ఉదయనిధి స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఆలరించడంతో పాటు, పలు చిత్రాలను నిర్మించిన ఈ హీరో.. ఇటీవల పూర్తి ఫోకస్ రాజకీయాలపై పెట్టారు. ఈ క్రమంలోనే తమ సొంత పార్టీ అయిన డీఎంకే నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. అప్పటి నుండి సినిమాలకు దూరమైన ఉదయనిధి స్టాలిన్.. ఇవాళ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఉదయనిధి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. గత 10 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న తాను ఇకపై సినిమాల్లో నటించనని క్లారిటీ ఇచ్చాడు. కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మించే సినిమా నుండి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
సినీ రంగంలో ''మామన్నాన్'' తన చివరి చిత్రమని వెల్లడించాడు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో పాటు పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించాలని నిర్ణయం తీసుకోవడంతోనే సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు పేర్కొన్నాడు. ఉదయనిధి తీసుకున్న ఈ షాకింగ్ డెసిషన్‌తో అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఉదయనిధి స్టాలిన్ యాక్టర్‌గానే కాకుండా ప్రొడ్యూసర్‌గాను భారీ హిట్ చిత్రాలను నిర్మించాడు. అంతేకాకుండా అతడి సినిమాలు తెలుగులో డబ్ అయ్యి కూడా భారీ విజయం దక్కించుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఇవాళ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉదయనిధికి అతడి తండ్రి, తమిళనాడు సీఎం స్టాలిన్ యువజన సంక్షేమ, క్రీడాభివృద్ధి శాఖను అప్పగించాడు.