‘దేవర-2’లో ఆ పాన్ ఇండియా స్టార్ హీరో.. నెట్టింట హైప్ పెంచుతున్న న్యూస్

by Kavitha |
‘దేవర-2’లో ఆ పాన్ ఇండియా స్టార్ హీరో.. నెట్టింట హైప్ పెంచుతున్న న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా ‘దేవర’(Devara) సినిమాతో మనముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. కొరటాల శివ(Koratal Shiva) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతోనే ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న ‘ఆర్ సీ-16’(Rc-16) మూవీలో నటిస్తుంది.

ఇక దీనికి ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రజెంట్ ‘వార్-2’(War-2) సినిమాతో పాటు ప్రశాంత్ నీల్‌(Prashanth Neel)తో ఓ చిత్రం చేస్తున్నాడు. అలాగే ‘దేవర-2’(Devara-2)లో కూడా నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కొరటాల శివ దేవర-2 పై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న కథలో చాలా మార్పులు చేసి కొత్త స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పై ఫోకస్ చేసినట్లు సమాచారం.

అయితే ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్(Ranveer Singh) కూడా నటించబోతున్నట్లు టాక్. ఇక అతని కోసం ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేసినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దేవర-2 షూటింగ్ ఈ ఏడాది చివర్లో లేదా 2026 జనవరిలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.


Next Story

Most Viewed