- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఒక్క పాటే నా లైఫ్ ఛేంజ్ చేసింది.. సింగర్ సునీత
దిశ, వెబ్‌డెస్క్: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన గానంతో, అందంతో, బ్యూటీఫుల్ స్మైల్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో సమానంగా మంచి క్రేజ్ దక్కించుకుంది. కాగా ఈ రోజు (మే 10)న తన పుట్టిన రోజు సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. సునీత చిన్నతనంలోనే కర్ణాటక సంగీతంలో ట్రైనింగ్ తీసుకుంది. 13 ఏళ్ల వయస్సులోనే గురువుతో కలిసి త్యాగరాజ ఆరాధన ప్రోగ్రామ్‌లో పాల్గొని.. మొదటి బహుమతి అందుకుంది. ఆమెకు 15 ఏళ్లు ఉన్నప్పుడు ‘‘పాడుతా తీయగా’’ ప్రోగ్రామ్‌లో అవకాశం వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘గులాబీ’’ చిత్రంలో ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు’’ అనే పాటతో తన కెరీర్‌ను ప్రారంభించారు.
ఈ మధురమైన గొంతుతో ఆమె ఎంతో మంది ఫ్యాన్స్‌ను దక్కించుకుంది. తర్వాత సౌందర్య, అనుష్క, తమన్నా, జెనీలియా, భూమిక, మీరా జాస్మిన్, శ్రియా నటించిన సినిమాల్లో పాడారు. సునీతకు సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశం వచ్చినా తిరస్కరించిందట. ఇప్పటి వరకు తను తెలుగు, కన్నడ, మళయాల, తమిళ భాషల్లో కలిపి 3 వేల పైచిలుకు పాటలు పాడారు. 19 సంవత్సరాలకు కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరు ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చాక.. అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థాలు రావడంతో డివోర్స్ తీసుకొన్నారు. ఈ ఏడాది జనవరిలో బిజినెస్‌మెన్ రామకృష్ణ వీరనేనిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేడు తన 45 పుట్టిన రోజును జరుపుకుంటుంది.
Also Read...
లగ్జరీ హౌస్ కొనుగోలు చేసిన సమంత.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!