ఆ హీరో హ్యాండ్సమ్‌గా ఉంటాడు.. అతడినే పెళ్లి చేసుకుందామనుకున్నా: Manchu Lakshmi

by Anjali |   ( Updated:2023-07-17 12:42:39.0  )
ఆ హీరో హ్యాండ్సమ్‌గా ఉంటాడు.. అతడినే పెళ్లి చేసుకుందామనుకున్నా: Manchu Lakshmi
X

దిశ, వెబ్‌డెస్క్: నటిగా, హోస్ట్‌గా, యూట్యూబర్‌గా ఇలా అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించింది మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ. కానీ ఇంటర్వ్యూల్లో, ప్రోగామ్స్‌లో కాస్త తిక్క తిక్కగా మాట్లాడుతూ ట్రోల్స్‌కు గురవుతూ.. తరచూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా లక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని..‘‘ నేను ఫస్ట్ హాలీవుడ్‌లో ఉన్నాను. అక్కడే మూవీస్ చేశాను. అక్కడ మంచి అవకాశాలు వస్తున్న టైంలోనే ఇండియాకు వచ్చాను. అప్పుడు అక్కడే ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని. ఆ సమయంలో నాకు ‘టామ్ క్రూయిస్‌తో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు అతడు బిగ్‌ స్టార్ అయ్యాడు. అతడే నాకు మొదటి క్రష్. చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. ఒకవేళ నేను హాలీవుడ్‌లోనే ఉండి ఉంటే తప్పకుండా ఆయన్నే వివాహం చేసుకునే దాన్నంటూ’’ చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్లు ‘ఇంకా నయం ఆ హీరోనే నీ వెంట పడ్డాడని చెప్పలేదు. బతికించావ్ అమ్మా! అంటూ కొందరు, నిన్ను టాలీవుడ్ హీరోలే పట్టించుకోరు ఇంకా హాలీవుడ్ హీరోల ముచ్చట చెప్తున్నావా అంటూ మంచు లక్ష్మీపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Read More: భర్తలకు టార్చర్ చూపించిన మెగా డాటర్స్.. అందుకే విడాకులు ఇచ్చారట

Advertisement

Next Story