‘నాటు నాటు’ పాటకు మరో అరుదైన గౌరవం

by Javid Pasha |
‘నాటు నాటు’ పాటకు మరో అరుదైన గౌరవం
X

దిశ, వెబ్ డెస్క్: దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకొని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటింది. ఎమ్ఎమ్ కీరవాణి కంపోజ్ చేసిన ఈ నాటు నాటు పాటను రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆలపించగా.. బెస్ట్ ఒరిజినల్ కేటాగిరీలో ఈ సాంగ్ ఆస్కార్ అవార్డు సాధించింది. ఇక తాజాగా నాటు నాటు పాట ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ గౌరవానికి అమెరికాలోని న్యూజెర్సీ వేదికైంది.

ఈ సాంగ్ ఆస్కార్ గెలిచిన సంద‌ర్భాన్ని అమెరికాలోని టెస్లా కార్ ఓన‌ర్స్ డిఫ‌రెంట్‌గా సెల‌బ్రేట్ చేశారు. ఎడిసన్ సిటీలోని పార్కింగ్ ఏరియాలో తమ కార్లను పార్కు చేసిన వందలాది టెస్లా కార్ల ఓనర్స్.. నాటు నాటు పాట బీట్ కు తగ్గట్లు తమ కార్ల హెడ్ లైట్స్‌, టెయిల్ లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోకు మిలియ‌న్ల‌లో వ్యూస్ వస్తున్నాయి.

Advertisement

Next Story