నా స్టామినా చూసి బాయ్‌ఫ్రెండ్ షాక్ అయ్యాడు.. యంగ్ బ్యూటీ

by Sathputhe Rajesh |
నా స్టామినా చూసి బాయ్‌ఫ్రెండ్ షాక్ అయ్యాడు.. యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా: టెలివిజన్ నటి తేజస్వీ ప్రకాష్ తన ప్రియుడు కరణ్ కుంద్రాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల కాలంలో తనను చూసే విధానాన్ని మార్చేస్తున్నాడంటూ తమ మధ్య కెమిస్ర్టీ గురించి ఓపెన్ అయింది. ఈ మేరకు జూన్ 10న తన బర్త్‌డే పార్టీ కోసం గోవాకు వెళ్తున్నట్లు చెప్పిన బ్యూటీ.. 'కరణ్ ఈ మధ్య నా సామర్థ్యాన్ని గుర్తిస్తున్నాడు. నా పని విధానాన్ని చూసే పద్ధతి మార్చుకున్నాడు. మంచి ప్రాజెక్ట్, టీమ్ లభిస్తే అద్భుతాలు చేయగలనని నమ్ముతున్నాడు. నేను సత్తా చూపేందుకు గొప్ప చాన్స్ కోసం ఎదురుచూస్తున్నా' అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఈ మధ్య తనతో గడిపేందుకు సమయం దొరకడం లేదన్న నటి.. కలిసిన క్షణాలన్నీ సాఫీగా సాగుతాయని చెప్పింది. ఇక ప్రేమ సంబంధాల్లో హెచ్చు తగ్గులున్నప్పటికీ అపారమైన అవగాహన, నమ్మకం ఉంటేనే జీవితంలో సురక్షితంగా స్థిరపడొచ్చని వివరించిన తేజస్వి.. బిగ్‌ బాస్ విజయం తర్వాత విరామం దొరకనందుకు సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది.


Advertisement

Next Story