- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తేజా సజ్జా ‘హనుమాన్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్ అయినట్టేనా?
దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజా సజ్జా కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. అలాగే తేజ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా కావడంతో టాలీవుడ్ స్టార్స్ అందరూ హనుమాన్‌కు సపోర్ట్ నిలిచి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేశారు. దీంతో హనుమాన్ థియేటర్స్‌లో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూశారు. ఈ సంక్రాంతి కానుకగా నేడు హనుమాన్ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది.
దీంతో ఈ సినిమా చూసిన వారంతా తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందంటూ చెబుతున్నారు. విజువల్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని వేరే రేంజ్ కి తీసుకు వెళ్లాయని కామెంట్స్ చేస్తున్నారు. అంత లో బడ్జెట్ లో హై స్టాండర్డ్ విజువల్స్ సూపర్ అంటూ చెబుతున్నారు. ఇక ముఖ్యంగా ప్రతి ఒక్కరు టైటిల్ కార్డ్ సీన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుందని చెబుతున్నారు. అలాగే ప్రశాంత్ వర్మ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఎక్స్ట్రార్డినరీ అంటున్నారు. మొత్తానికి హనుమాన్ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.