నడిరాత్రి సెట్స్ పైకి తారక్ సినిమా..!

by Shiva |   ( Updated:2024-06-02 09:33:04.0  )
నడిరాత్రి సెట్స్ పైకి తారక్ సినిమా..!
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న -కొరటాల సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి విదితమే. ఇప్పుడు సినిమా రెగ్యులర్ షూటింగ్ నడిరాత్రి సెట్స్ పైకి వచ్చింది. ఎన్టీఆర్ పై అప్పుడే కొన్ని సన్నీవేశాలను కూడా తీశారు. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు వెల్లడించారు. మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ తో కలిసి దిగిన ఫొటోలను కూడా. ఆ ఫొటో బ్యాక్ డ్రాప్ లో భారీ బోటు సెట్ కూడా కనిపిస్తుండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి మొదలైంది. కొరటాల శివ డైరెక్షన్ లో పెద్ద బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.

మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ దర్శనమివ్వనున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతోంది ఈ సినిమా. హాలీవుడ్ స్టార్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ సినిమాకు కీలక యాక్షన్ సన్నివేశాలు కంపోజ్ చేయనున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే మరి కొంతమంది కీలక నటీనటులకు సంబంధించిన వివరాలతో పాటు, షూటింగ్ అప్ డేట్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

Advertisement

Next Story