Ram Charan సినిమాలో విలన్‌గా తమిళ్ Star Hero..!

by sudharani |   ( Updated:2023-08-20 16:54:41.0  )
Ram Charan సినిమాలో విలన్‌గా తమిళ్ Star Hero..!
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే.. రామ్ చరణ్ మరో సినిమా ఒకే చేసినట్లు తెలుస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చేయబోతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సంప్రదించారట మేకర్స్. ఆయన కూడా ఒకే చెప్పినట్లు టాక్. అయితే.. కీలకమైన పాత్ర అంటే విలన్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తుంది. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :

లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న యంగ్ హీరో.. ఫొటోలు వైరల్

BRO OTT Release Date: పాన్ ఇండియా రేంజ్‌లో పవన్ మూవీ ఓటీటీ రిలీజ్

Advertisement

Next Story