Super Deluxe: తెలుగులో రిలీజ్ కాబోతున్న తమిళ్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ.. ఏకంగా 400 థియేటర్లలో..

by sudharani |   ( Updated:2024-08-07 11:45:28.0  )
Super Deluxe: తెలుగులో రిలీజ్ కాబోతున్న తమిళ్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ.. ఏకంగా 400 థియేటర్లలో..
X

దిశ, సినిమా: తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న థ్రిల్లింగ్ మూవీ ‘సూపర్ డీలక్స్’ ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి, డైరెక్టర్ త్యాగరాజన్ కుమారరాజా కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, సమంత రూత్ ప్రభు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో విజయ్ సేతుపతి స్పెషల్ లేడీ క్యారెక్టర్ రోల్‌లో నటించారు. థ్రిల్లింగ్ మూవీగా తెరకెక్కిన ‘సూపర్ డీలక్స్’ 2019లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అప్పట్లో తమిళ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి కాసుల వర్షం కురిపించి.

అయితే.. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ మూవీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు పూల మధు. దైవసెల్వితీర్థం ఫిలమ్స్ బ్యానర్‌పై దైవసిగమణి, తీర్థమలై, పూల మధు నిర్మాతలుగా వ్యవహరిస్తూ ఆగస్టు 9 న తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 పైగా థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. మరి తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలంటే ఇంకో రెండు రోజులు వేచి చూడాల్సి ఉంది.


Advertisement

Next Story