అలాంటివి ఎప్పుడో చూశానంటూ తమన్నా బోల్డ్ కామెంట్స్?

by samatah |   ( Updated:2023-07-22 06:44:48.0  )
అలాంటివి ఎప్పుడో చూశానంటూ తమన్నా బోల్డ్ కామెంట్స్?
X

దిశ, వెబ్‌డెస్క్ : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మధ్య ఎక్కడ చూసినా తమన్నా పేరే మోగిపోతుంది. ఎందుకంటే ? బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతున్నాను అంటూ ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా విజయ్ వర్మ కూడా త్వరలో తమన్నాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, ఫ్యామిలీ నుంచి ఒత్తిడి పెరిగిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక తాజాగా ఓ మీడియా ఇంటరాక్షన్‌లో మాట్లాడిన తమన్నా, తన లైఫ్‌లో ఎదుర్కొన్న సమస్యల గురించి ఓపెన్ అయ్యింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు వెక్కిరించారని, పోయి పోయి సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నావా అంటూ అసహ్యించుకున్నారు. నీ బ్రతుకు ఇక బస్టాండ్” అంటూ దారుణంగా అవమానించారని ..అది చూసి మా తల్లిని తల్లిదండ్రులు సైతం బాధపడ్డారని చెప్పుకొచ్చింది. కానీ నేను ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నానంటూ .. మన వెనుక నలుగురు ఏం అనుకున్నా పట్టించుకోకూడదు, అవి అన్నీ నాకు అలవాటే అంటూ కామెంట్స్ చేసింది.

Read more : Movie News & Gossips

Advertisement

Next Story