అదే రోజు విజయ్‌తో పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పనున్న Tamannaah Bhatia

by sudharani |   ( Updated:2023-11-15 11:50:26.0  )
అదే రోజు విజయ్‌తో పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పనున్న Tamannaah Bhatia
X

దిశ, సినిమా: చాలా రోజులుగా మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా, విజయ్ వర్మ డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. మొదటిసారిగా గోవాలో న్యూ ఇయర్ పార్టీలో కిస్ చేసుకుంటూ ఇద్దరు దొరికిపోవడంతో.. డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆరు నెలల తర్వాత తమ మధ్య బంధాన్ని బయటపెట్టారు. ఇక రీసెంట్‌గా ‘లస్ట్ స్టోరీస్ 2’ ఆంథాలజీలో ఈ ఇద్దరు రెచ్చిపోయి బెడ్ రూమ్ సీన్స్‌లో నటించారు. అప్పటి నుంచి ఓపెన్‌గానే బయట తిరిగేస్తున్నారు. ఇంటర్వ్యూలలో ఒకరిపై ఒకరు ప్రేమ కురిపిస్తూ ప్రశంసించుకుంటున్నారు.

అయితే ఇప్పటికే ముప్పై ఏళ్లు దాటేసిన ఈ జంట అసలు ఏడడుగులు నడవబోతుందా..? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇన్ని రోజులగా డేటింగ్‌లో ఉంది చాలని, ఇక పెళ్లి చేసుకోవాలంటూ ఇరు కుటుంబాల నుంచి ఒత్తిడి వస్తుందని సమాచారం. దీంతో వచ్చే నెల 21న తమన్న బర్త్ డే రోజున.. మ్యారేజ్ గురించి అనౌన్స్‌ చేయనున్నట్లు టాక్ వినిపిపిస్తుంది.

Advertisement

Next Story