అప్పుడు నా లవర్.. ఇప్పుడు సోదరి: తమన్నాపై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

by Anjali |   ( Updated:2023-08-03 14:54:37.0  )
అప్పుడు నా లవర్.. ఇప్పుడు సోదరి: తమన్నాపై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో సుశాంత్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘కరెంట్, కాళిదాసు, అడ్డా, చి.ల.సౌ, ఇచ్చట వాహనములు నిలపరాదు’ లాంటి చిత్రాల్లో నటించి హీరోగా మంచి పేరు దక్కించుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ చిత్రంలో కీర్తి సురేశ్, తమన్నాలకు ఈ హీరో సోదరిగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఈ నెల(ఆగస్టు)11న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సుశాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరై.. ‘‘అల వైకుంఠపురములో చిత్రంలో దర్శకుడు త్రివిక్రమ్‌ నన్ను కొత్తగా చూపించారు. ఆ సినిమాకి పనిచేసే సమయంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. డైరెక్టర్ సుధీర్‌వర్మ ‘రావణాసుర’లో ఓ విభిన్న పాత్రలో నన్ను చూపించారు. ఇప్పుడు భోళాశంకర్ విషయానికి వస్తే.. డైరెక్టర్‌ మెహర్ రమేశ్‌ ఓసారి ఫోన్ చేసి ఈ మూవీ గురించి చెప్పారు.

చిరంజీవి సార్‌తో ఓ పాటలోనూ నటించే అవకాశం ఉందనడంతో వెంటనే ఈ సినిమాకి ఓకే చెప్పేశా. మెగాస్టార్‌తో పని చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది. ఈ హీరో మూవీస్ చూస్తూ పెరిగాను. ఆయన డ్యాన్స్‌ అంటే నాకు బాగా ఇష్టం. నా చిన్నతనంలో ఆయన సినిమాల షూటింగ్‌కు వెళ్లేవాణ్ని.’’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తమన్నా అప్పుడు కాళిదాసు చిత్రంలో నా ప్రేయసి.. ఇప్పుడు ఈ మూవీలో నా సోదరి’’ అని సుశాంత్ చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వారు. . ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

Read More..

Rashi Khanna : దాచి దాచి అందాలను చూపిస్తున్న రాశీఖన్నా.. దాసోహం అంటున్న కుర్రాళ్లు

Advertisement

Next Story

Most Viewed