- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రకుల్‌ని చూసి తాను కూడా ఆపని చేస్తానంటున్న తమన్నా!!.. షాక్ లో ఫ్యాన్స్
దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. అంతే కాకుండా తన డాన్స్‌కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పడంలో అతియోశక్తి లేదు. స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు సూపర్ హిట్ సిరీస్ లస్ట్ స్టోరీకి సీక్వెల్‌గా.. తెరకెక్కుతున్న ‘లస్ట్ స్టోరీ 2’ సిరీస్‌లో విజయ్ వర్మకు జోడీగా నటిస్తున్నది. కాగా మిల్కీ బ్యూటీ తమన్న ఒక హీరోయిన్‌ని ఫాలో అయ్యి ఒక పని చేయబోతుందనే వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
అసలు విషయంలోకి వెళితే.. తన తోటి హీరోయిన్ అయినా రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య పెళ్లి చేసుకొని బిజినెస్ లో ముందుకు సాగుతూ.. వ్యాపారంలో కూడా సక్సెస్ అవుతుంది. అయితే ఇక తన ఫ్రెండ్ రకుల్ చేసిన పనిని ఇప్పుడు తమన్నా కూడా బిజినెస్‌లో అడుగు పెట్టాలను కుంటుందంట. దీనిలో భాగంగా ఫుడ్, జిమ్ బిజినెస్ తో పాటు ఇక పలు రంగాలలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతుందట తమన్నా. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఎందుకంటే తమన్నాకి కాస్త బిజినెస్ నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది. అందుకే బిజినెస్ రంగంలో రాణించగలరా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా మిల్క్ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయవర్మతో డీప్ లవ్ లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక పెళ్లి తర్వాత ఎలాగో ఆఫర్స్ తగ్గుతాయి కాబట్టి ఇలా వ్యాపారంపై దృష్టి పెట్టిందని నెట్టింట చర్చించుకుంటున్నారు.