బోనమెత్తిన తమన్నా.. బ్లాక్ బస్టర్ చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్

by Anjali |
బోనమెత్తిన తమన్నా.. బ్లాక్ బస్టర్ చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. రీసెంట్‌గా ఈ బ్యూటీ జిగార్ ద్వయం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘స్త్రీ’ చిత్రంలో వేసిన గ్లామర్ స్టెప్పులను మేకర్స్ వదిలారు. ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ‘ఆజ్ కి రాత్’ అనే సాంగ్‌లో మిల్క్ బ్యూటీ గ్లామర్‌కు కుర్రాళ్లు ఫిదా అయిపోయారనడంలో అతిశక్తిలేదు. ఇకపోతే తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వం వహిస్తోన్న‘ఓదెల-2’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఓదెల మూవీకి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఆషాడ బోనాల సందర్బంగా మూవీ టీమ్ ఓ అదిరిపోయే పోస్టర్ విడుదల చేశారు. ఇందులో మిల్క్ బ్యూటీ బోనం ఎత్తుకుని ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక తమన్నా ఈ చిత్రంలో శివ శక్తి అనే రూల్‌లో నటిస్తుంది. మహదేవ్ భక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కాశీలో జరుగుతోంది. కాంతార సినిమాకు సంగీతాన్ని సమకూర్చిన అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారు.

Advertisement

Next Story