తమన్నకు విజయ్ అంటే అంత పిచ్చా.. అతని కోసం ఆ రూల్‌ని కూడా బ్రేక్ చేసిందా?

by samatah |   ( Updated:2023-06-24 10:32:04.0  )
తమన్నకు విజయ్ అంటే అంత పిచ్చా.. అతని కోసం ఆ రూల్‌ని కూడా బ్రేక్ చేసిందా?
X

దిశ, సినిమా: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు విజయ్ వర్మ, తమన్న. ఈ రియల్ లైఫ్ ప్రేమ జంట తాజాగా ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లో నటించారు. ఈనెల 29న నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కానుండగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘18 ఏళ్లుగా ఎలాంటి సీన్స్ చేయకూడదని రూల్ పెట్టుకున్నానో విజయ్ కోసం ఇప్పుడు వాటిని బ్రేక్ చేశా’ అంటూ కామెంట్స్ చేసింది. దీంతో విజయ్.. ‘‘లస్ట్ స్టోరీస్ 2’ స్క్రిప్ట్ చదవగానే హీరోయిన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారని అడిగాను. తమన్న అని చెప్పగానే మంచి సెలక్షన్ అనేశాను. ఎందుకంటే నిజానికి ఆ పాత్రకు ఆమె కరెక్ట్‌గా సరిపోయింది. అంతేకాదు ఆ పాత్రకు ఆమె మరింత గ్లామర్ తెచ్చింది. తను నటించే పాత్రలో ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి, చాలా శ్రద్ధగా పని చేస్తుంది’ అంటూ తన ప్రియురాలిపై పొగడ్తల వర్షం కురిపించాడు.

Also Read: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విజయ్ దేవరకొండ-రష్మిక.. ఆ వీడియో వైరల్..

Advertisement

Next Story