అది అందంగా ఉన్నా అంగీకరించలేదు.. కావాలనే తొక్కేశారు

by Aamani |   ( Updated:2023-05-14 12:16:19.0  )
అది అందంగా ఉన్నా అంగీకరించలేదు.. కావాలనే తొక్కేశారు
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ‘తాజ్’ ఫేమ్ సౌరసేని మైత్రా.. కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై ఓపెన్ అయింది. నిజానికి తనకు అందమైన గొంతు ఉన్నప్పటీకీ కొంతమంది తన వాయిస్‌లో సమస్య ఉందని చెప్పినట్లు గుర్తుచేసుకుంది. అంతేకాదు ఈ కారణంతో తనకు చెప్పకుండానే ఓ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు మరొక మహిళను మేకర్స్ ఎంచుకున్నారని వాపోయింది. ‘నా వాయిస్ కారణంగా గొప్ప అవకాశాలను కోల్పోయాను. నిజానికి కొన్ని షోల్లో నాది ‘స్వీట్, క్యూట్’ వాయిస్ అన్నారు. చాలా బాగుందని, ప్రొఫెషనల్‌గా అనిపిస్తుందని ఇష్టపడ్డారు. కానీ సినిమాల్లో మాత్రం ఎందుకో తొక్కేశారు’ అంటూ ఆవేదన చెందింది. ఏదేమైనా.. తాను ప్రేక్షకుల నుంచి చాలా ప్రేమను పొందుతున్నట్లు పేర్కొన్న మైత్రా.. ‘తాజ్’ మొదటి సీజన్‌లో అవకాశం రావడం గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెప్పింది.

Also Read: నా నడుము పట్టుకుని.. తన సొంత ఆస్తిలా ఫీల్ అయ్యాడు

Advertisement

Next Story