- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్త్రీల బట్టలపై కాదు.. ప్రజా సమస్యలపై ఫోకస్ చేయండి : Swara
దిశ, సినిమా : బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ దీపికా పదుకొనేకు మద్ధతుగా వాయిస్ వినిపిస్తోంది. షారుఖ్-దీపిక జంటగా వస్తున్న 'పఠాన్'మూవీ నుంచి ఇటీవల విడుదలైన 'బేషరమ్ రంగ్' సాంగ్‌ను వివాదాస్పదంగా మార్చడం ఆశ్చర్యంగా ఉందని చెప్పింది. అలాగే రాజకీయ నాయకులు పని చేయకుండా హీరోయిన్ల బట్టలపై ఫోకస్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడింది. 'అధికారంలో ఉన్న మన దేశ నాయకులకు నటీనటుల డ్రెస్‌లను చూసిన తర్వాత మరి కొంత సమయం మిగిలి ఉంటే ప్రజలకోసం ఉపయోగపడే పని చేయండి. అంతేగాని ఇలాంటి ప్రచారాలు చేస్తూ టైమ్ వేస్ట్ చేయకూడదు' అంటూ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. అలాగే మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా చేసిన..'ముస్లిం పురుషుడు కుంకుమపువ్వు ధరించిన స్త్రీని పట్టుకున్నాడు. ఈ పాటను పూర్తిగా డర్టీ మైండ్ సెట్‌తో చిత్రీకరించారు' అనే వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన స్వరా..'నేరస్థులు మంత్రిత్వ శాఖలలో చేరడం ఇకపై వార్త కాదు. ఐటమ్ సాంగ్స్‌లో నటీమణులు ఏ రంగు దుస్తులు ధరిస్తున్నారనేది సీరియస్ వార్త' అంటూ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
Also Read....
గుడ్ న్యూస్‌తో పుట్టింటికి వెళ్లిన ఉపాసన.. పోస్ట్, ఫోటోస్ వైరల్ !