- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలసుబ్రహ్మణ్యం చనిపోగానే ఫిల్మ్ ఫీల్డ్‌లో చీకట్లు అలుముకున్నాయి: సుశీల
సినిమా: టాలీవుడ్ టాప్ సింగర్‌లో ఒకరైన సుశీల అమ్మ గొంతు తేనె కంటే తియ్యగా ఉంటుంది. ఇప్పటివరకూ భాషతో సంబంధం లేకుండా వేలకు పైగా పాటలు పాడింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుశీల.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. సుశీల మాట్లాడుతూ.. 'ఇంతవరకు ఎన్నో వేల పాటలు పాడాను. పాడటం ఎప్పుడు అలసటగా అనిపించేది కాదు.
ఇక నేను.. బాలు కలిసి ఒక రికార్డింగ్ థియేటర్ నుంచి మరో రికార్డింగ్ థియేటర్‌కు పరుగులు పెడుతూ ఉండేవాళ్లం. మహాత్ముడు బాలు ఎక్కడ ఉన్నాడోగానీ, ఆయన పోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ చీకటై పోయింది. అది ఆయన ప్రత్యేకత. ఇంకో విషయమేమిటంటే.. ఘంటసాలగారు మా ఊళ్లోనే చదువుకున్నారు. కానీ, నేను అయనను మొదటి సారి మద్రాసులోని ఏవీఎస్ స్టూడియోలో చూశాను. 'భూకైలాస్' మూవీ అనుకుంటా .. మొదటి పాట పాడాను. ఎలా అంటే ఒక వైపు పులిలా మైకు ముందు ఘంటసాల గారు.. అయన ముందు నేను. ఎలా పాడినో తలచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. ఇక నా కొరియర్ అంటే 'లవ కుశ', 'భక్త ప్రహ్లాద' ఈ రెండు సినిమాలు చాలు' అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది.