పాన్ ఇండియా లెవెల్లో ‘గజిని-2’ ప్లానింగ్?

by Prasanna |   ( Updated:2023-05-08 08:26:35.0  )
పాన్ ఇండియా లెవెల్లో ‘గజిని-2’ ప్లానింగ్?
X

దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య, మురుగదాస్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గజిని’. 2005లో విడుదలైన ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులో బిగ్ హిట్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సీక్వెల్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్‌లో సూర్య కాకుండా అమీర్ ఖాన్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో హిందీ ‘గజినీ’ రిమేక్‌లో అమీర్ నటించగా ఇప్పుడు అతనితోనే సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట. మురుగదాస్, అమీర్ ఖాన్, అల్లు అరవింద్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీని పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read more:

బాలీవుడ్‌‌ ఆయోమయంలో ఉంది.. రణ్‌బీర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

Next Story