డైరెక్టర్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పిన సూర్య.. ఫొటోలు వైరల్

by sudharani |   ( Updated:2024-10-07 15:27:28.0  )
డైరెక్టర్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పిన సూర్య.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: వెర్సటైల్ స్టార్ సూర్య, వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం ‘Suriya44’. గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అంతే కాకుండా సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. అలాగే సూర్య ఫ్రెంచ్ గడ్డంతో, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఈ గ్లింప్స్ చూస్తునే సినిమా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని అర్థం అవుతోంది.

ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సూర్య తన ట్విటర్ వేదికగా.. ‘చాలా లొకేషన్‌లలో ఆరోగ్యకరమైన, సంతోషకరమైన షూట్ పూర్తయింది.. సూపర్ టాలెంటెడ్ తారాగణం & సిబ్బందితో చాలా జ్ఞాపకాలు మూటకట్టుకున్నాను. కార్తీసుబ్బరాజ్‌కు స్పెషల్ థాంక్స్. #Suriya44ని మరపురాని అనుభవంగా మార్చినందుకు మీకు & మా బృందానికి ధన్యవాదాలు’ అంటూ నోట్ షేర్ చేశాడు. కాగా.. ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నందున, మేకర్స్ త్వరలో ప్రమోషన్స్‌ని ప్రారంభించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed