రజనీకాంత్ మూవీలో సూర్య కీ రోల్?

by Anjali |   ( Updated:2023-04-27 08:58:38.0  )
రజనీకాంత్ మూవీలో సూర్య కీ రోల్?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్‌‌తో పాటు టాలీవుడ్‌లో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సూర్య తన కెరీర్‌లో 42వ సినిమా చేస్తున్నాడు. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే హీరోగానే కాకుండా ఈ మధ్య కాలంలో పలు చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ క్యామియో రోల్‌లో కనిపించి అదరగొడుతున్నాడు సూర్య. ఇప్పుడు మరో సాలిడ్ ప్రాజెక్ట్‌లో నటించనున్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. టి.జి జ్ఞానవేల్ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 170వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో సూర్య కీ రోల్‌ పోషించబోతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Also Read..

చైతుతో డేటింగ్ విషయాన్ని శోభితా ఎందుకు దాచిపెడుతోంది?

Advertisement

Next Story