పవన్ కల్యాణ్ ‘OG’లో సూపర్ స్టార్ మహేష్ బాబు?

by Anjali |   ( Updated:2023-09-05 07:00:43.0  )
పవన్ కల్యాణ్ ‘OG’లో సూపర్ స్టార్ మహేష్ బాబు?
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’. తాజాగా.. పవన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు పెంచేసుకున్న పవన్ ఫ్యాన్స్ ఈ గ్లింప్స్‌తో మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఇందులో మహేష్ బాబు గెస్ట్ రోల్‌లో కనిపిస్తారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ త్రివిక్రమే స్వయంగా ఈ సినిమాలో నటించడానికి మహేష్‌ను ఒప్పించాడని సమాచారం. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఇటు పవర్ స్టార్, అటు సూపర్ స్టార్ కలిసి కనిపిస్తే మాత్రం మామూలుగా ఉండదని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More: BiggBoss season:7 మొదటివారం నామినేషన్స్‌లో 8 మంది.. ఎవరెవరంటే?

Advertisement

Next Story