బ్యాంకులో తీసుకున్న అప్పు కట్టని స్టార్ హీరో.. ఆస్తి వేలం.. పేపర్ ప్రకటనతో ఫ్యాన్స్ షాక్

by Dishaweb |   ( Updated:2023-08-21 15:37:49.0  )
బ్యాంకులో తీసుకున్న అప్పు కట్టని స్టార్ హీరో.. ఆస్తి వేలం.. పేపర్ ప్రకటనతో ఫ్యాన్స్ షాక్
X

దిశ, సినిమా : ‘గదర్ 2’ సిరీస్‌తో కమ్ బ్యాక్ ఇచ్చేసిన హీరో సన్నీ డియోల్.. సెకండ్ ఇన్నింగ్స్‌ను గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. పవర్‌ఫుల్ ప్రాజెక్ట్స్ ఎంచుకుంటూ.. సక్సెస్ దిశగా పయనిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ హీరో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకున్న రూ. 56 కోట్లు చెల్లించడం లేదని తెలుస్తోంది. దీంతో జుహులోని తన స్టూడియో సన్నీ సూపర్ సౌండ్‌ను వేలం వేయడానికి సదరు బ్యాంక్ వార్తా పత్రికలలో నోటీసును ప్రచురించింది. దీంతో అభిమానులు బాధ పడుతూనే.. ‘గదర్ 2’ సక్సెస్‌తో సన్నీకి స్టూడియోను మాత్రమే కాదు ఏకంగా బ్యాంక్‌నే కొనేంత సత్తా ఉందని అంటున్నారు. ఇక ఫిల్మ్ క్రిటిక్ కేఆర్‌కే ఈ స్టూడియోను కొనుగోలు చేస్తానని ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి : ‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్..

Advertisement

Next Story