- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నైపుణ్యాలు పెంచుకుని బతకడం నేర్చుకోండి.. సునీల్ శెట్టి
దిశ, సినిమా: ప్రముఖ ఎడ్యుకేషన్ కంపెనీ 'బైజుస్' 2,500 మంది ఉద్యోగులను తొలగించడంపై బాలీవుడ్ నటుడు, వ్యాపారవేత్త సునీల్ శెట్టి స్పందించాడు. సొసైటీలో మంచి పేరు సంపాదించిన కంపెనీ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని తాను ఎప్పుడూ ఊహించలేదన్నాడు. అలాగే ఉద్యోగాలు కోల్పోయిన వారి లైఫ్ వీలైనంత త్వరగా నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేసిన ఆయన.. 'ఒక సంస్థ వేల మంది ఉద్యోగులను తొలగించిందని విన్నాను. ఇలాంటి షాకింగ్ న్యూస్ డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఆ కంపెనీ నిర్ణయం 10వేల మంది జీవితాలను ప్రభావితం చేసింది. ఇది అంత తేలికైన విషయం కాదు. జాబ్ కోల్పోయిన వారంతా మంచి స్థాయిల్లో నిలదొక్కుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మన దేశంలో కొత్తగా వ్యాపారాలు వృద్ధి చెందడానికి భారీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాల అవకాశాలపై దృష్టి పెట్టాలి. క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ నెమ్మదిగా, స్థిరంగా ఉండటం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. నైపుణ్యాలు పెంచుకుని బతకడం నేర్చుకోవాలి' అంటూ తనదైన స్టైల్‌లో జాబ్ కొల్పోయిన ఎంప్లాయిస్‌కు పాజిటివ్ ఎనర్జీ నింపేందుకు ట్రై చేశాడు.