- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ కారణంతో 15 ఏళ్లకే ఇంటి నుంచి వెళ్లిపోయా.. షారుఖ్ కూతురు కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: ఉన్నత చదువుల కోసం 15 ఏళ్ల వయసులోనే ఇంటిని విడిచిపెట్టడాన్ని ఒక కల్చరల్ షాక్‌గా పేర్కొంది సుహానా ఖాన్. ఇటీవల ముంబైలో జరిగిన నటి కోయెల్ పూరీ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షారుఖ్ కూతురు.. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లిన తన బాల్యం అనుభవాలను గుర్తుచేసుకుంది. ‘చిన్నతనంలోనే కుటుంబాన్ని విడిచి న్యూయార్క్ వెళ్లాను. మొదట్లో నేను వలస వచ్చాను అనే భావనతో ఎవరితో మాట్లాడకపోయేదాన్ని. కేవలం చదువుకోవడానికే అక్కడికి వెళ్లాననే ఆలోచనలతోనే ఉండేదాన్ని. ఇంట్లో ఉండే అనుభూతిని అక్కడ వెతుక్కోవడానికి చాలా టైమ్ పట్టింది. అయితే నాకు దొరికిన స్నేహితుల వల్ల నేను ఊహించిన దానికంటే గొప్పగా కాలేజీ మరో ఇంటిలా మారిపోయింది. దానికి కారణం ఫ్రెండ్స్. వారి ప్రేమ నాకు గొప్ప అనుభూతిని కలిగించింది’ అని తెలిపింది స్టార్ కిడ్. ఇక ఆమె వ్యాఖ్యలపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. ‘నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. నువ్వు చాలా గ్రేట్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.