- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్న సుడిగాలి సుధీర్..! అమ్మాయి ఎవరంటే..?
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో సుడిగాలి సుధీర్ ఒకడు. జబర్దస్త్ షో తో ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. తన కామెడీ టైంమింగ్, యాక్టింగ్, స్కిల్స్‌తో ఎంతో మంది అభిమానులను దక్కించుకున్నాడు. దీంతో వరుస ఆఫర్లతో అటూ షోలు చేస్తూనే.. ఇటూ వెండితెరపై కూడా మెరుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
ఈ క్రమంలోనే తోటి కమేడియన్స్ కూడా సుధీర్, రష్మిలా మధ్య ఏదో ఉన్నట్లు ఆటపటిస్తుంటారు. కానీ, పెళ్లి మాటకు వస్తే మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ఉంటారు. అయితే.. తాజాగా సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తనకు వరుసకు మరదలు కాబోయే అమ్మాయితో సుధీర్ పెళ్లికి సిద్ధం అయ్యాడని టాక్. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే సుధీర్ స్పందిచాల్సి ఉంది.
Read more: