‘రావణాసుర‘ మూవీ గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ సుధీర్ వర్మ

by Prasanna |
‘రావణాసుర‘ మూవీ గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ సుధీర్ వర్మ
X

దిశ, సినిమా: రవితేజ హీరోగా నటించిన థ్రిల్లర్ చిత్రం ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు సుధీర్ వర్మ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ సినిమాలో దక్ష నాగర్కర్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా నటిస్తున్నారని తెలుసు, కానీ దర్శకుడు మాత్రం అస్సలు ఈ మూవీ‌లో హీరోయిన్సే లేరు అని షాకింగ్ న్యూస్ చెప్పాడు. ‘‘ఈ మూవీ గురించిన ఎటువంటి హింట్ కూడా బయటకు రివీల్ చేయదలచుకోలేదు. ఎందుకంటే ఇందులో ఎన్నో షాకింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. థియేటర్లలో చూసినప్పుడే ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. ఆ ఎక్సయిట్మెంట్‌ను ప్రేక్షకులకు దూరం చేయదలుచుకోలేదు. అందుకే మూవీని తమిళం, మలయాళం‌లో ఒకేసారి విడుదల చేయట్లేదు. ఎందుకంటే రిలీజ్‌కు 15 రోజుల ముందే వారికి కాపీ పంపించాలి. సర్‌ప్రైజ్‌లు రివీల్ అవుతాయని తెలుగులో విడుదలైన ఓ వారం తర్వాత ఆ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. కాగా ఈ సినిమాలో హీరోయిన్ లేదు. కానీ చాలా మంది హీరోయిన్లు నటించారు. ప్రతీ పాత్ర కథలో కీలకంగా ఉంటుంది. ఇక రవితేజ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అని సుధీర్ వర్మ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story