- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Star Wars Movie: వేలంలో భారీ ధర పలికిన బికినీ!
దిశ, డైనమిక్ బ్యూరో: స్టార్ వార్స్ చిత్రంలో క్యారీ ఫిషర్ ప్రిన్సెస్ లియాగా ధరించిన బికినీ వేలంలో భారీ ధర పలికింది. ఈ బంగారు బికినీని ఓ వ్యక్తి ఏకంగా రూ.1.46 కోట్లకు సొంతం చేసుకున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లుకాస్ నిర్మించిన స్టార్ వార్స్ మూవీ హాలీవుడ్ సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో క్యారీ ఫిషర్ ప్రిన్సెస్ లియాగా బానిసగా బందించడిన సమయంలో ధరించిన బంగారు బికినీ ఎంతో ఫేమస్ అయ్యింది. ప్రముఖ కాస్టూమ్ డిసైనర్ రిచర్డ్ మిల్లర్ డిజైన్ చేసిన డ్రెస్‌కు విశేష గుర్తింపు లభించింది. దీనిని విక్రయించేందుకు డల్లాస్ కు చెందిన హెరిటేజ్ సంస్థ వేలం నిర్వహించింది. ఈ బంగారు బికినీని సొంతం చేసుకునేందుకు ఎంతో మంది బిడ్డర్లు ఆసక్తి కనబరిచారు. చివరికీ దీనిని ఓ వ్యక్తి 175 వేల డాలర్లు అంటే దాదాపు రూ.1.46 కోట్లకు వేలం పాడాడు. దీనిపై హెరిటేజ్ ఆక్షన్ వైస్ ప్రెసిడెంట్ జో మద్దలేనా మాట్లాడుతూ.. ఆ బికినీ కోసం అభిమానులు ఇంతలా పోటీ పడతారని తాను ఊహించలేదని, వేలంలో భారీ ధరకు కొనుగోలు చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపాడు.