- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేకాటలో లక్షలు పోగోట్టుకున్న స్టార్ సింగర్ గీతా మాధురి!
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ సింగర్ గీతా మాధురి తన గానంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఈమె పాటలతో ప్రేక్షకులను అలరించింది. గీతా మాధురి ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇటీవల ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంది. మొన్నటివరకు భర్త నందుకు విడాకులు ఇవ్వబోతుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. వీటిపై గీతా మాధురి భర్త స్పందించి పుకార్లకు చెక్ పెట్టారు. ఇదంతా పక్కన పెడితే..
ఇటీవల గీతా మాధురి ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘‘నాకు జూదం ఆడటం ఎంతో ఇష్టం. క్యాసినో ఆడటంలో మునిగిపోతే ఏదీ పట్టించుకోను. ఆ ఆటలో అంతలా లీనమైపోతాను. ఈ గేమ్‌లో అంతగా ఏముందో తెలియదు కానీ దానికి నేను బాగా అడక్ట్ అయ్యాను. అందులో బ్లాక్ జాక్ అనే ఆట అంటే మరింత పడి చచ్చిపోతాను. ఈ ఆటను పూర్తిగా వదిలేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ నా తల్లిదండ్రులకు క్యాసినో గేమ్ ఎలా ఉంటుందో చూపించి మళ్లీ దాని వైపు వెళ్లకూడదని నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను.’’ అంటూ గీతా మాధురి వెల్లడించింది.
ఆస్ట్రేలియాలో జూదం ఆడి రూ.3 లక్షలు పోగోట్టుకున్నారని టాక్ వచ్చింది. అది ఎంతవరకు నిజమని ప్రశ్నించగా.. దీంతో గీతా మాధురి.. కాస్త సిగ్గుపడుతూ నవ్వుతూ ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకు? వదిలేయండి? అంతకంటే ఎక్కువే పోగొట్టుకున్నాను లేండి? అని తెలిపింది. ‘డబ్బు ఉందని ఎన్ని లక్షలను విలువ చేయకుండా పోగొట్టుకోవడమోనా? నందు కూడా ఈ సింగర్‌కు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకే ఇలా తయారయింది. రూ.3 లక్షలు కాదు అంతకంటే ఎక్కువే అంటే ఎన్ని లక్షలు పోగోట్టుకుందో’ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
- Tags
- geetha madhuri