రానా ఆస్తిని చూసి పెళ్లి చేసుకోవాలి అనుకున్న స్టార్ హీరోయిన్..?

by sudharani |   ( Updated:2023-09-24 11:40:07.0  )
రానా ఆస్తిని చూసి పెళ్లి చేసుకోవాలి అనుకున్న స్టార్ హీరోయిన్..?
X

దిశ, వెబ్‌డెస్క్: దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకున్న రానా.. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే రానా కోట్ల ఆస్తి చూసి ఓ స్టార్ హీరోయిన్ అతడిని వివాహం చేసుకోవాలి అనుకున్నాదట. ఆమె ఎవరు..? అనేది తెలుసుకుందాం..

టాలీవుడ్, బాలీవుడ్‌లో కూడా పలు సినిమాల్లో నటించిన రానాకు కొందరు హీరోయిన్లతో ప్రేమాయణం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వారిలో బిపాషాబసు ఒకరు. రానా, బిపాషా కలిసి నటించిన సినిమా ‘దమ్ మారో దమ్’. ఈ మూవీ చేస్తున్నప్పుడు రానా, బిపాషా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రానా కూడా బిపాషాను హైదరాబాద్ మొత్తం తిప్పి తన ఆస్తులను చూపించాడట. దీంతో ఆ ఆస్తులు చూసి ఫ్లాట్ అయిన బిపాషా రానాను పెళ్లి చేసుకోవాలని ట్రై చేసిందట. కానీ రానా ఆ ఛాన్స్ ఇవ్వలేదట. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ పుకార్లు షికార్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story