అలాంటి క్యారెక్టర్‌లే ఇస్తున్నారని.. సినిమా ఇండస్ట్రీనే వదిలేసిన హీరోయిన్

by Kavitha |   ( Updated:2024-02-22 07:48:18.0  )
అలాంటి క్యారెక్టర్‌లే ఇస్తున్నారని..  సినిమా ఇండస్ట్రీనే వదిలేసిన హీరోయిన్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో ఎవరైనా నటినటులు ఏదైనా ఒక క్యారెక్టర్ చేస్తే అది బాగా క్లిక్ అయితే వాళ్ళకి వరుసగా అలాంటి క్యారెక్టర్ లనే ఆఫర్ చేస్తూ ఉంటారు. అందుకే చాలామంది హీరోలు గానీ,హీరోయిన్ లు గానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు గానీ ఒకే రకమైన పాత్రలను కాకుండా డిఫరెంట్ పాత్రల్లో నటించడానికి సిద్ధమవుతూ ఉంటారు.అయితే ఒక హీరోయిన్ కి వరుస సినిమాల్లో చనిపోయే క్యారెక్టర్ లని ఇస్తున్నారనే ఉద్దేశ్యంతో తను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిందట.

ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే అన్షు.. ప్రభాస్ తో ‘రాఘవేంద్ర’, నాగార్జున తో ‘మన్మధుడు’ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తీసిన రెండు సినిమాలు అయిన తన అందం నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో కొనసాగలేక పొయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్షు తను ఇండస్ట్రీ కి దూరం అవ్వడనికి గల కారణాలు తెలిపింది. నటి మాట్లాడుతూ ‘నేను తెలుగులో నటించిన రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గానే కనిపించాను. అది కాకుండా ఈ రెండు మూవీస్ లో నా క్యారెక్టర్ చనిపోతుంది. దీంతో నాకు మరో రెండు మూడు చిత్రాలో ఆఫర్ వచ్చాయి. కానీ సేమ్ అలాంటి క్యారెక్టర్లు రావడం తో విసిగిపోయాను. సినిమాల్లో నటించడం కంటే ఖాళీగా ఉన్నది బెటర్ అని సినిమా ఇండస్ట్రీని వదిలేసాను. ఇప్పటికైన ఇండస్ట్రీలో టాలెంట్ ను బట్టి క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది. ఒక క్యారెక్టర్ బాగా చేశారని ఆ నటులను అదే క్యారెక్టర్ లో పరిమితం చేయడం అనేది కరెక్ట్ కాదు’ అంటూ తెలిపింది అన్షు.

Read More..

29 ఏళ్ల క్రితం మొదలైన ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది.. సీనియర్ నటి కుష్బూ ఎమోషనల్ ట్వీట్

Advertisement

Next Story

Most Viewed