- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ్ చరణ్‌తో నటించనంటున్న స్టార్ హీరోయిన్?
దిశ, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో మగధీర సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్నాడు ఈ హీరో. మరీ ముఖ్యంగా త్రిబుల్ ఆర్ మూవీతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. తన నటనతో గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయాడు. అలాంటి హీరో పక్కన నటించాలని ఏ హీరోయిన్‌కు ఉండదు.
చాలా మంది యంగ్ హీరోయిన్స్, స్టార్ హీరోయిన్స్ రామ్ చరణ్ సరసన నటించే అవకాశం కోసం ఎదురు చూస్తారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం రామ్ చరణ్ హీరో అయితే నటించను అని తెగేసి చెప్పిందంట. బాలీవుడ్‌లో హీరోగా నటించాలనే ఉద్దేశ్యంతో చెర్రీ అమితాబచ్చన్ నటించిన జంజీర్ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేశాడు. ఈ సినిమాను తెలుగులో తుఫాన్ అనే పేరుతో రిలీజ్ చేశారు.ఈ మూవీలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించింది.అయితే ఈ అమ్మడుకన్న ముందు సినిమాలో హీరోయిన్‌గా దీపిక పదుకునేను నటించాలని మూవీ మేకర్స్ కోరారంట. కానీ ఆమె రామ్ చరణ్ పక్కన నటించను అని తెగేసి చెప్పిందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.