15 కిలోలు పెరిగిన హీరోయిన్.. తగ్గేందుకు ఎంత కష్టపడుతుందో తెలుసా? (వీడియో)

by GSrikanth |
15 కిలోలు పెరిగిన హీరోయిన్.. తగ్గేందుకు ఎంత కష్టపడుతుందో తెలుసా? (వీడియో)
X

దిశ, సినిమా: ఇంతియాజ్ అలీ డైరెక్షన్‌లో రాబోతున్న ‘చంకీలా’ ప్రాజెక్ట్ గురించి ‘యానిమల్’ సినిమాను వదులుకున్న పరిణీతీ చోప్రా.. ప్రస్తుతం జిమ్‌లో కసరత్తులు చేస్తుంది. ప్రముఖ సింగర్ అమర్‌జోత్ కౌర్‌ పాత్రలో కనిపించబోతున్న ఆమె.. ఈ మధ్యే ఈ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ క్యారెక్టర్‌లో పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యేందుకు 15 కేజీలు పెరిగిన బ్యూటీ.. ఏఆర్ రెహమాన్ స్టూడియోలో పాటలు పాడటం, ఇంటికి వెళ్లి జంక్‌ఫుడ్ లాగించడంతో ఈ ఆరు నెలలు గడిపానని చెప్పింది. చిత్రీకరణ పూర్తి కావడంతో మళ్లీ సన్నగా అయ్యేందుకు జిమ్‌కు వచ్చానన్న పరిణీతి.. ఇదంతా ఇంతియాజ్ కోసమే చేసినట్లు తెలిపింది. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుండగా.. షూటింగ్ డేస్‌ను మిస్ అవుతున్నట్లు ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. జిమ్‌ వర్కౌట్ సెషన్‌కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది.

Advertisement

Next Story