స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్.. అసలు విషయం బయటపెట్టిన సన్నిహితులు

by sudharani |   ( Updated:2024-03-09 13:55:19.0  )
స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్.. అసలు విషయం బయటపెట్టిన సన్నిహితులు
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. గతేడాది పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడైన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమాయణం నటిపిన ఈ అమ్ముడు.. గతేడాది రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే.. సినిమాలు కూడా తీస్తుంది. ఇదిలా ఉంటే.. పరిణీతి ప్రెగ్నెంట్ అని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది.

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా దంపతులు త్వరలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పడం మొదలు పెట్టారు. ఇక ఈ రూమర్స్ రోజురోజుకు ఎక్కువకావడంతో పరిణీతి చోప్రా సన్నిహితులు స్పందించి.. ఆమె గర్భవతి కాదని తేల్చి చెప్పేశారు. దీంతో పరిణీతి చోప్రా ప్రెగ్నెంట్ అనే వార్తలకు బ్రేక్ పడినట్లు అయింది కానీ, ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story